పల్నాడు: సైబర్ నేరాలపై పోలీసులకు ఎస్పీ అవగాహన
పల్నాడు జిల్లాలోని పోలీసు అధికారులకు శనివారం ఎస్పీ శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ క్రైమ్ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ పోలీసులు నేరం జరిగిన వెంటనే స్పందించాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో ఈ నేరాలు అరికట్టవచ్చన్నారు. అవగాహన సదస్సులో సీఐలు, ఎస్ఐలు పాల్గొని సైబర్ క్రైమ్ లో తమ సందేహాలను వ్యక్తం చేసి అడిగి తెలుసుకున్నారు.