రాయచోటి: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో 12 మందికి జరిమానా
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 12 మందిని శనివారం రాయచోటి కోర్టులో హాజరుపరచగా జడ్జి వారికి జరిమానా విధించారని సిఐ చంద్రశేఖర్ తెలిపారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 12 మంది పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి జడ్జి ముందు హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ. 10, 500 జరిమానా విధించారని సిఐ చంద్రశేఖర్ తెలిపారు.