భార్య గొంతు కోసి చంపి పరారైన భర్త
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన గుమ్మఘట్ట మండలంలోని కలుగోడులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కలుగోడుకు చెందిన బోయజ్యోతిని గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తిరిగి రాలేదని భర్త ఈ దారుణానికి వడిగట్టాడు.