పుట్టపర్తి: టిడిపి కార్యకర్త ఆత్మహత్యయత్నం
శ్రీసత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం కేంద్రమైన మారాలకు చెందిన టిడిపి కార్యకర్త ఆత్మహత్యకి పాల్పడ్డారు. వైసిపి నాయకుడు రామ్మోహన్ అనే వ్యక్తి బెదిరిస్తున్నారని, భయపడి శనివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. మెరుగైన వైద్యం కోసం ఆదివారం బెంగళూరు ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.