రేపు అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా: సిపిఎం
బడ్జెట్ లో సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆదివారం పేర్కొన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. ఈ ధర్నాకు కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ హాజరవుతారన్నారు.