రూ. 3 లక్షల నగదు చోరీ
గుంతకల్లులో వేణుగోపాల్ రెడ్డికి చెందిన ద్విచక్ర వాహనంలో సోమవారం రూ. 3 లక్షల నగదు చోరీకి గురైనట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. హౌసింగ్ బోర్డు లో నివాసం ఉన్న వేణుగోపాల్ రెడ్డి మధ్యాహ్నం యూనియన్ బ్యాంకులో రూ. 3లక్షల నగదు డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంలో వెనక బ్యాగులో పెట్టుకుని క్రౌన్ టాకీస్ వీధిలోకి వెళ్లాడు. అక్కడ వాహనాన్ని నిలబెట్టి తిరి గొచ్చేసరికి నగదు చోరీకి గురైంది.