అనకాపల్లి: ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
రెక్కల కష్టంపై ఆధార పడిన ముఠా కార్మికులకు ఎటువంటి చట్టాలు అమలు కావడం లేదు ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈనెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము శనివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఎస్సీ జెడ్ ముఠా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలు పంపిణీ చేశారు.