విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత 1350 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మల్కాపురం సిఐటియు కార్యకర్తలు బుధవారం నిరాహార దీక్షలో కూర్చున్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు.