గోపాలపట్నం శాఖా గ్రంథాలయంలో ఈనెల 14 నుంచి జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ముగిశాయి. ముఖ్య అతిథిగా గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు ఎల్లపు చిన అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాలు వినియోగించుకుంటే అభివృద్ధి చెందవచ్చని చెప్పారు. అలాగే వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతి అందజేశారు.