వి. ఆర్. పురం మండలం సున్నవారిగూడెం గ్రామంలో శనివారం వచ్చిన గాలి వర్షానికి చెట్టుకొమ్మలు తెగి విద్యుత్ తీగలపై పడ్డాయి దీంతో విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. ఈ ప్రమాదంతో ఎటువంటి నష్టం జరగలేదు. ఈ సమాచారం స్థానిక ప్రజల ద్వారా తెలుసుకున్న స్థానిక విద్యుత్ శాఖ జేఎల్ఎం వినోద్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తెగిన విద్యుత్ తీగలను సరిచేసి విద్యుత్ సప్లై అందించారు. స్థానిక గ్రామస్తులు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.