పెందుర్తి: ఇంచార్జ్ మంత్రిపై గురుతరమైన బాధ్యతలు
అనకాపల్లి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పై గురుతరమైన బాధ్యతలు ఉన్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అనకాపల్లిలో మంత్రి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఇన్ఛార్జ్ మంత్రి, హోమ్ మంత్రి, ఎంపీ సీఎం రమేష్ నేతృత్వంలో జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రవీంద్రను నియమించడం అదృష్టంగా పేర్కొన్నారు.