ఎస్. రాయవరం మండలం జేవీ పాలెంలో క్యాన్సర్ పై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పీఎన్వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఊపిరితిత్తులు, స్టమక్ పాంక్రియాస్ చెస్ట్ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పొగాకు గుట్కా పాన్ మసాలా తినేవారికి క్యాన్సర్ వస్తుందన్నారు. మహిళల్లో గర్భసంచి, చెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.