విశాఖ: రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్
విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు ఆదివారం సాయంత్రం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు వివాదాలకు దూరంగా ఉండాలని, కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.