విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం, రవాణా నియంత్రణపై సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, వాటికి బానిసలుగా మారితే జీవితాలు నాశనమౌతాయన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.