కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ పథకం కింద సబ్సిడీపై అందిస్తున్న సోలార్ విద్యుత్ కనెక్షన్లు ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటికి అందే విధంగా గ్రామ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని ఎంపీపీ టీ వీ రాజారామ్, ఎండిఓ కే అప్పారావు సూచించారు. సోమవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక కిలో వాట్ కు 60000 ఖర్చు అయితే 30000 ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు.