వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ బంజారాల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రూ. 900 కోట్లతో నగార పేరుతో మహారాష్ట్ర రాష్ట్రంలో పెరగవ్లో మ్యూజియం స్థాపన చేశారు. బంజారాల ఇతిహాసాలను వెలికి తీసి బంజారాల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.