SLBC టన్నెల్ వద్ద ఉత్కంఠ కొనసాగుతుంది. టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని 96 గంటలు కావొస్తున్నా రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు వారిని కాపాడలేకపోయాయి. అయితే ప్రభుత్వం కార్మికులను ఎలాగైనా కాపాడాలని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బుధవారం ‘ఆపరేషన్ మార్కోస్’ చేపట్టనుంది. ఈ బృందాల ద్వారా ఈరోజు కార్మికులను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది.