విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని పెన్ పహాడ్ మండల విద్యాధికారి రవి అన్నారు. శుక్రవారం పెన్ పహాడ్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో హిందీ భాష స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులలో భాషా నైపుణ్యాలను మెరుగు పరిచి కథలు, పద్యాలను వ్రాయడంలో మెళకువలు నేర్పాలన్నారు. ఉపాధ్యాయుల TLM తయారీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు గుంటి సత్యనరాయన్, ఆనంద భాస్కర్, ఆశీయా బేగం ఉన్నారు.