కోదాడ: దమ్ము లేపే నృత్యాలతో ముగిసిన అమ్మవారి నిమజ్జనం

కోదాడ పట్టణంలోని నాయనగర్లో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన ఊరేగింపు ఆదివారం ఉదయం నుండి ప్రారంభమై రాత్రి ముగిసింది. వీధుల వెంట మహిళలు కోలాటాల నృత్యాలు, యువకుల తీన్మార్ స్టెప్పులతో అమ్మవారి శోభాయాత్ర దద్దరిల్లింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అమ్మవారిని అనంతగిరి మండలం కిష్టాపురం పాలేరు వాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி