నరసింహుని హుండీ ఆదాయం 28 లక్షలు

జగిత్యాల జిల్లా లోని ప్రాచీన పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ 75 రోజుల హుండీ ని బుధవారం విప్పి లెక్కించగా 28 లక్షల12వేల 877 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి సంకటల శ్రీనివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. ఇట్టి హుండీలో మిశ్రమ బంగారం 67గ్రాములు మిశ్రమ వెండి 3కిలోల 78 గ్రాములు విదేశీ కరెన్సీ నోట్లు 7 వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేనవేషన్ కమిటీ అధ్యక్షుడు ఇందరపు రామన్న, సభ్యులు వేముల నరేష్ కుమార్, గుంపుల రమేష్, చుక్క రవి, స్తంభంకాడి మహేష్, గునిశెట్టి రవి, అక్కినపల్లి సురేందర్, పల్లెర్ల సురేందర్, ఇనుగంటి రామ వెంకటేష్ రావు, గందే పద్మ శ్రీనివాస్, సుపరెండేంట్ ద్యావల్ల కిరణ్ అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி