తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా స్థానికతను దెబ్బతీసే టటువంటి అశాస్త్రీయమైన 317 జీవో వలన ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఈ జీవో స్థానికత అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది కావున తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉంది తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక మైనటువంటి తెలంగాణ ఉద్యోగుల కు అన్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తే ఉద్యోగులకు స్థానికేతర సమస్యలు ఉండవని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని ఉద్యోగులేవారు దైర్యం కోల్పోవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో కవి గాయకులు ఉపాధ్యాయ పత్రిక ఎడిటర్ రాంచందర్ భీం వంశీ, టి పి టీఎఫ్ నాయకులు జీవన్ రావు, అమృత్, నర్సింలు, తపస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు దత్తత్రి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గుప్తా సుదీర్ బాండారి, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విఠల్, ఆనంద్, రాంచందర్, తెలంగాణ జన సమితి నాయకులు మల్లికార్జున్, గోపాల్ రెడ్డి, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.
వధేరాకు రూ.4.20 కోట్లు.. రఘువంశీకి రూ.3 కోట్లు