మజ్లీస్ పార్టీలో పెద్ద ఎత్తున యువత చేరిక

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో మజ్లీస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ ప్లోర్ లీడర్ కౌసర్ మోహి ఉద్దీన్ కార్వాన్ శాసనసభ్యులు మరియు సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఆదేశానుసారం జహీరాబాద్ కార్యాలయంలో మజ్లీస్ పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు అత్తర్ అహ్మద్ పార్టీ ఖాండ్వా వేసీ భరత్ నగర్ యువత పార్టీలో చేరడం జరిగింది. అనంతరం మజ్లీస్ పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు అత్తర్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు.

మజ్లిస్ పార్టీ ప్రజల మధ్య ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని పేర్కొన్నారు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌లో చేరి పార్టీకి బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ రఫి, జాయింట్ సెక్రటరీలు మెుహిఉద్దీన్, గౌరి ఆమెర్, బిన్ అబ్దుల్లా, షేక్ ఇలియాజ్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అజ్మత్ పాషా, వార్డ్ అధ్యక్షులు ముజీబ్ పార్టీ నాయకులు ముజాహిద్, మహ్మద్ షఫీ, మహ్మద్ సమీర్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన యువకుల్లో మహ్మద్ నబీ, షేక్ జాఫర్, షేక్ ఇస్మాయిల్, కుతుబుద్దీన్, షఫీ, అమెర్, జావేద్, షేక్ ఖయ్యూమ్, మిరాజ్, ఇర్ఫాన్, మహ్మద్ అమెర్, ఆసిఫ్ తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி