జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన సిపిఐ నాయకులు

జహీరాబాద్ లో గత 2018 మార్చి 28 నాడు జహీరాబాద్ మండలంలోని 5 గ్రామాలను పట్టణంలో విలీనం చేస్తూ మున్సిపల్ శాఖ జారీ చేసిన ఆదేశాలను నాలుగు గ్రామాలు పాటించి విలీనం అవ్వగా హోతి కె గ్రామ వాసి అయిన మొహమ్మద్ ఒబేద్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సవాలు చెయ్యడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ఎన్నికలు జరగగా జహీరాబాద్ మున్సిపల్ ఎన్నిక కేసు కారణంగా ఎన్నికలు జరపడం సాధ్యం కాలేదు. గురువారం మధ్యాహ్నం హోతి కె గ్రామ వాసి మహ్మద్ ఒబేద్ వేసిన కేసును కొట్టివేయ్యడంతో శుక్రవారం మధ్యాహ్నం జహీరాబాద్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జహీరాబాద్ శాఖ వారు పురపాలిక కమిషనర్ సుభాష్ రావు దేశ్ముఖ్ ని పలువురు శాలువా కప్పి సన్మానించారు.

సుభాష్ రావు దేశ్ముఖ్ జహీరాబాద్ పట్టణ కమిషనర్ గా బాధ్యతలు చేప్పట్టిననాటి నుంచి నేటి వరకు అభివృద్ధికి పెద్ద పీట వేశారని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ సమ దృష్టితో చూడటం హర్షించదగ్గ పరిణామం అని సంగారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శి సయ్యద్ జలలుద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ జలలుద్దీన్ మాట్లాడుతూ హోతి కె గ్రామం వాసులు వేసిన కేసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసినందున జహీరాబాద్ కమిషనర్ సుభాష్ రావు దేశ్ముఖ్ చొరవ చూపి పురపాలిక ఎన్నికలు త్వరలో జరిగే విదంగా చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలలుద్దీన్ కోరారు. గతంలో జహీరాబాద్ పట్టణ పురపాలక ఎన్నికల కోసం రెండు రోజులు నిరాహారదీక్షలు కూడా చేపట్టినట్టు సీపీఐ జహీరాబాద్ డివిజన్ కార్యదర్శి కె నర్సింలు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ లేనందున ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ ఎన్నికలు జరిపి పట్టణ అభివృద్ధికి సహకరించాలని సీపీఐ పార్టీ కోరింది. కార్యక్రమంలో జహీరాబాద్ సీపీఐ కార్యదర్శి కె నర్సింలు, అజరుద్దీన్, రాములు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி