సంగారెడ్డి లోని గిరిజన గురుకుల సంక్షేమ న్యాయ కళాశాలలో బిఏ ఎల్. ఎల్. బి కోర్సులో మిగిలిన సీట్లకు ఈనెల 19న స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సిపల్ నిరీక్షణ రావు బుధవారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి టీజీ లాసెట్- 2024లో అర్హత పొందిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు రావాలని పేర్కొన్నారు.