ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికలతో మరోసారి నిరూపితమైందని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.