సంగారెడ్డి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సి ప్రకటించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సి ప్రకటించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న డీఏ లను వెంటనే చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி