సదాశివపేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కోసం కౌన్సిల్ లో తీర్మానం చేసినట్లు వైస్ చైర్మన్ చింతా గోపాల్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు.