రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి పట్టణంలో ఈనెల 6వ తేదీన పర్యటిస్తున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు విద్యానగర్లోని సెయింట్ ఆందోళన పాఠశాల వద్ద సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభిస్తారని చెప్పారు. 11: 30 గంటలకు పిఎస్ఆర్ గార్డెన్లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.