మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ పొడిగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి వరకు మెట్రో రైల్ పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ పటాన్చెరు వరకు మెట్రో రైల్ పొడిగిస్తూ ప్రకటన విడుదల చేయడం హర్షనీయమని పేర్కొన్నారు. సంగారెడ్డి వరకు మెట్రో రైల్ విస్తరిస్తే కార్మికులు, ఉద్యోగులకు అణువుగా ఉంటుందని చెప్పారు.