ఖైదీలకు అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. కందిలోని సెంట్రల్ జైలును ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలు మొత్తం తిరిగి పరిశుభ్రతను పరిశీలించారు.