జిన్నారం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఐకేపీ ఏపీఎం నరేందర్

జిన్నారం, ఊట్ల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిన్నారం మండల ఐకేపీ ఏపీఏం నరేందర్ బుధవారం ప్రారంభించారు. రైతుల నుండి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించిందని అన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி