బైండ్ల కులస్తులు రాజకీయంగా ఎదగాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ అన్నారు. సంగారెడ్డి లోని ఎస్వీఎస్ గార్డెన్ లో రాష్ట్ర ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బైండ్ల కులస్తులకు 9% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. పిల్లలను చదివించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చూడాలని సూచించారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.