సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో దామోదర రాజనర్సింహా ఆదేశానుసారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జ్యొషి వట్ పల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద పట్ల వినయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదిరాబాద్ గ్రామ అధ్యక్షులు పడమటి గాలయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొంగని మల్లారెడ్డి, గోపాల్, నర్సింలు, రాజు, బిక్షపతి, భుమయ్య, పోషయ్య, బేతయ్య యువజన కాంగ్రెస్ నాయకులు రాజు, దశరథ్, ప్రభాకర్, ఖాజా, మాణిక్యం, రాజు, వెంకట్, శ్రీకాంత్, నాగరాజు, శ్రీశైలం, పాల్గొన్నారు.