ఆర్థిక సహాయం చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని కర్చల్ గ్రామానికి చెందిన ఈడ్గీ నిర్మలమ్మ w/ కీశే"లక్మాగౌడ్ ఇల్లు ఆదివారం అర్ద రాత్రి షార్ట్ సర్క్యూట్ తో దగ్దం అయింది. ఇందులో దదాపు 200000: (రెండు లక్షల రూపాయల) నగదు తగల బడింది. ఇటీవలే వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కు డ్రా చేసిన 50000 వేలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. సామాగ్రితొ పాటు బట్టలు. 2 తులం బంగారం గుండ్లు దగ్దం కావడంతో పాటు పేంకుటిల్లు పూర్తిగా కాలిపోయి కూలిపోయింది. రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అవుసలి ప్రభాకర్ వెంటనే స్పందించి వారికి సహాయంగా 5000 రూపాయలను అందజేశారు. స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కర్చల్ పిఏసిఎస్ డైరెక్టర్ రామకృష్ణ గౌడ్, నాయకులు రాజు , సంగారెడ్డి , ఫణి రాజ్, గౌరీ శంకర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி