సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో స్వామి వివేకానంద 160 వ జయంతి సందర్భంగా రాయికోడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏ ప్రభాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొహమ్మద్ రఫీక్, అడివప్ప, రాహూల్, నాగరాజు, రాములు, ఆకాష్, విఠల్, భీమ్ ఆర్మీ రాయికోడ్ మండల అధ్యక్షులు అనిల్ రావణ్, ఉపాధ్యక్షులు మోహన్, విఠల్, నిరంజన్, శ్రీనివాస్, రాములు, అంజయ్య, సాయిబాబా, గ్రామస్థులు పాల్గొన్నారు.