సామాజిక, ఆర్థిక, విద్య , ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీ చాలా ముఖ్యమని , పూర్తి జాగ్రత్తగా వివరాలను డేటా ఎంట్రీ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.