నల్గొండ: విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ పర్యవేక్షిక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఇతర విద్యుత్తు అధికారులతో విద్యుత్ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

தொடர்புடைய செய்தி