పోలీసులపై చేస్తున్న అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదు

నస్పూర్ మున్సిపాలిటీలో నాలా కబ్జా విషయంలో వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం పిలిపిస్తే మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ గొంతుపై చిన్న కత్తితో గాటు పెట్టుకున్నట్లు మంచిర్యాల ఏసిపి ప్రకాష్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సత్యనారాయణ చెపుతున్నట్లు పోలీసులపై చేస్తున్న అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని, తప్పుడు కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. 2012 నుండి ఇప్పటి వరకు అతనిపై 7, 8 కేసులు నమోదై ఉన్నాయన్నారు.

தொடர்புடைய செய்தி