14న మందమర్రిలో రౌండ్ టేబుల్ సమావేశం

బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేసి, సింగరేణికే బొగ్గు గనులను కేటాయించాలని ఈ నెల 14న మందమర్రి పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సమావేశంలో పాల్గొని సింగరేణిని పరిరక్షణకు సలహాలు, సూచనలు తెలపాలని కోరారు.

தொடர்புடைய செய்தி