రిటైర్డ్ డిసీపీ చేయూత

తాను చదువుకున్న పాఠశాలకు రిటైర్డ్ డిసీపీ చేయూతనందించారు. జన్నారం మండలంలోని చింతగూడ జడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 152 మందికి స్పోర్ట్స్ దుస్తులను ఆయన గురువారం అందించారు. ఇదే పాఠశాలలో చదువుకొని డిసీపీగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యానని పేర్కొన్నారు. ఈ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సహాయాన్ని అందించడం జరిగిందని, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி