జైపూర్ మండలంలోని శెట్టిపల్లి, పెగడపల్లి, నర్వ గ్రామ పంచాయతీలను మండల పంచాయతీ అధికారి శ్రీపతి భాపురావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ దరఖాస్తుదారులు అన్ని పత్రాలతో ఎల్ఆర్ఎస్ యాప్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయితి కార్యదర్శులకు సూచించారు.