జైపూర్: కోతులకు ఆహారం వేసిన వ్యక్తికి జరిమానా

జైపూర్, భీమారం మధ్యగల అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై కోతులకు ఆహారం వేసిన శ్రీరాంపూర్ కు చెందిన బత్తుల శ్రీనివాస్ కు మంగళవారం అటవీశాఖ సెక్షన్ అధికారి రామకృష్ణ రూ. 2000 జరిమానా విధించారు. ఉదయం అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా గమనించి జరిమానా విధించినట్లు తెలిపారు. రహదారిపై కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల కోతులు ప్రమాదాలకు గురై చనిపోతున్నాయని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రయాణికులపై దాడులకు పాల్పడుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி