రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నేతకాని ఆత్మగౌరవ భవన్, నేతకాని కుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేతకాని మహర్ సేవా సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సంఘం నాయకులు పాల్గొన్నారు.