తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా తాండూర్ మండలానికి చెందిన పులగం తిరుపతి ఎన్నికయ్యారు. ఆదివారం ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిని ఎన్నుకున్నారు. తిరుపతి మాట్లాడుతూ టిపియూఎస్ సిద్దాతాలు, ఆదర్శాలకు అంకితమై చిత్త శుద్ది తో పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రయివేట్ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.