తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం సంధ్యకి ఆదివారం 108 అంబులెన్స్ లో ప్రసవం జరిగింది. ఉదయం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సంధ్య భర్త మోతిరాం 108 కు సమాచారం అందించారు. 108 లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది ఈఎంటి తిరుపతి, పైలెట్ గుజ్జల సంపత్ లు ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు.