భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం అన్నారు. ఈ సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరై ముఖ్య నాయకులు కార్యకర్తలకు దీక్షా దివస్ కార్యక్రమంపై దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. ఈ సమావేశాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.