వైరా: పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి

2019 నుంచి స్పెషల్ డ్రైవ్ లో తీసుకున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాదె లక్ష్మీ నారాయణ, తోట రామాంజనేయులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులతో కలిసి మంగళవారం వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కమిషనర్ చింతల వేణుకు వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி