కల్లూరు మండల కేంద్రంలో సీపీఐ-2025 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పలువురికి సభ్యత్వం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు ఎజెండాగా సీపీఐ పార్టీ పోరాటాలు నిర్వహిస్తుందని, పార్టీ వందో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా సభ్యులుగా చేరుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగు నరసింహారావు, శివరామకృష్ణ, తదితరులు ఉన్నారు.