కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి

కొత్తగూడెంలో గిరిజన సంఘాల ముఖ్య నాయకుల సమావేశం కాన్షిరాం అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు గిరిజన సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని అన్నారు. అలాగే కొత్తగూడెం మున్సిపాలిటీలో విలీనమైన రామవరం ఏజెన్సీ ప్రాంతాన్ని తొలగించాలన్నారు. కార్పొరేషన్ ప్రతిపాదనను విరమించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி