గాంధీ ఆసుపత్రి ఎదురుగా మెట్రో స్టేషన్ కింద ఫుట్పాతులపై, డివైడర్లపై నివసిస్తున్న యాచకులను ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. గత కొంతకాలంగా గాంధీ ఎదురుగా నిర్వహిస్తున్న అన్నదానాలతో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న యాచకులు ఇటీవల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే అనారోగ్యకారణలతో ప్రతిరోజు ఒకరు చనిపోతేనే ఉన్నారు. శనివారం ఇక్కడి నుంచి వీరిని ఖాళీ చేయించినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.